close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెమ్‌డెసివిర్‌ కావాలంటే ఈ నంబరుకు మెసేజ్‌ పెట్టండి

91338 96969

మూసాపేట, న్యూస్‌టుడే: ఇకనుంచి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే ఆర్డర్‌ తీసుకుంటామని, మందును ఎక్కడ తీసుకోవాలి.. ఎవరి ద్వారా తీసుకోవాలి? అనే వివరాలు సైతం ఫోన్‌లో అందిస్తామని హెటిరో విక్రయదారులు ప్రకటించారు. హైదరాబాద్‌ మూసాపేట వైజంక్షన్‌లోని హెటిరో అనుబంధ సంస్థ ద్వారా ఈ ఔషధాన్ని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. పంపిణీలో జరుగుతున్న జాప్యంపై రోగుల సంబంధీకులు సోమవారం ఆందోళన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఔషధాన్ని దొడ్డిదారిన నల్లబజారుకు తరలిస్తున్నట్లు ఆరోపణలు కూడా రావడంతో కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు విక్రయ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం నుంచి ఈ విక్రయ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇక నుంచి రెమ్‌డెసివిర్‌ కావల్సినవారు 91338 96969 నంబరుకు వాట్సప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా వివరాలను పంపించాలి. రోగి పేరు, వారి తాలూకు వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, రోగి చికిత్స పొందుతున్న ఆసుపత్రి, పేషెంట్‌కు కేటాయించిన ఐపీ నంబరు, చికిత్స పొందుతున్న నగరం పేరు, కావల్సిన ఔషధాల సంఖ్య తప్పనిసరిగా పొందుపరచాలి. తమకు అందిన ఆర్డర్ల ప్రకారం, తమ వద్ద నిల్వ ఉన్న స్టాకునుబట్టి ఔషధాన్ని పంపిణీ చేస్తామని.. ఏ తేదీన, ఏ సమయంలో, ఎక్కడ తీసుకోవాలో రోగి బంధువు ఫోన్‌కు సమాచారం పంపిస్తామని విక్రేతలు తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు