close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకాల ఉత్పత్తి పెంచండి

 వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు ప్రధాని పిలుపు

ఈనాడు, దిల్లీ: భారతీయులందరికీ అతి తక్కువ సమయంలోనే కరోనా టీకా అందాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అందుకు తగినట్లు టీకా ఉత్పత్తిని పెంచాలని పిలుపునిచ్చారు. టీకా తయారీ సంస్థల అధిపతులతో ప్రధాని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వ్యాక్సిన్ల తయారీలో ఇప్పటివరకూ వారు చూపించిన నిబద్ధత, సాధించిన విజయాలను అభినందించారు. ‘‘18 ఏళ్లు నిండిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి అత్యల్ప సమయంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తాం.  ప్రయోగదశల్లో ఉన్న వ్యాక్సిన్లకూ అనుమతులకు అవసరమైన మద్దతిస్తాం. కొవిడ్‌-19పై పోరాటంలో ప్రైవేటు వైద్యరంగానిది కీలక పాత్ర. వ్యాక్సినేషన్‌ లోనూ అది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసుపత్రులు, పరిశ్రమ మధ్య సమన్వయం అవసరం’’ అని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీలు కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఎండీ అధర్‌ పూనావాలా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, జెనోవా బయోఫార్మా సీఈఓ సంజయ్‌ సింగ్‌, జైదూస్‌ క్యాడిలా సీఎండీ రాజ్‌పటేల్‌, బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమాదాట్ల పాల్గొన్నారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు