close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాను జయించిన కేసీఆర్‌

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌గా నిర్ధారణ
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యుల వెల్లడి
నేటి నుంచి యథావిధిగా విధులు

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం మంగళవారం సీఎంకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది. ఆర్టీపీసీఆర్‌, యాంటిజెన్‌ పరీక్షలు రెండింటిలోనూ నెగెటివ్‌గా నివేదికలు వచ్చాయి. రక్త పరీక్షలు చేయగా అవి కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. సీఎం పూర్తిస్థాయిలో కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. బుధవారం నుంచి ఆయన విధుల్లో పాల్గొనవచ్చని వైద్యబృందం సూచించింది. గత నెల 14న సీఎంకు పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఐసొలేషన్‌లో ఉన్నారు.
వైద్యఆరోగ్యశాఖపై సమీక్ష నేడు!
కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్‌ బుధవారం హైదరాబాద్‌కు వచ్చే వీలుంది. ఆ వెంటనే ఆయన వైద్యఆరోగ్యశాఖ సమావేశం నిర్వహించనున్నారు. ఈటల రాజేందర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాక సీఎం ఆ శాఖను తన పరిధిలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఫోన్‌ ద్వారానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా కరోనా స్థితిగతులు, టీకాలు, పరీక్షలు, ఔషధాలు, కిట్లు, వైద్య సిబ్బంది తాత్కాలిక నియామకాలు, ఆక్సిజన్‌ సరఫరా, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల లభ్యత తదితర అంశాలపై ఆయన పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు