close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జేఈఈ మెయిన్‌ మే సెషన్‌ వాయిదా

ఈనాడు, దిల్లీ: ఈ నెల 24 నుంచి 28 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షను వాయిదా వస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులకు తగిన అవకాశం ఇవ్వడం కోసం ఎన్‌టీఏ ఈ ఏడాది నాలుగు సెషన్లలో ఈ పరీక్ష తలపెట్టింది. ఇప్పటికే రెండు సెషన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగిన పరీక్షకు 6,20,978 మంది, మార్చి 16 నుంచి 18వరకు జరిగిన పరీక్షకు 5,56,248 మంది హాజరయ్యారు. మూడో సెషన్‌ ఏప్రిల్‌ 27, 28, 30 తేదీల్లో జరగాల్సి ఉండగా, కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు చివరి సెషన్‌ ఈ నెల 24, 25, 26, 27, 28 తేదీల్లో జరగాల్సి ఉండగా, కొవిడ్‌ విజృంభణ కారణంగా దీన్నీ వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ప్రస్తుతం వాయిదాపడిన ఏప్రిల్‌, మే సెషన్లను రీషెడ్యూల్‌ చేస్తామని, మే సెషన్‌కు సంబంధించిన నమోదు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేదీ త్వరలో చెబుతామని ఎన్‌టీఏ పేర్కొంది. ప్రస్తుతం మిగిలిన ఖాళీ సమయాన్ని విద్యార్థులు మరింత బాగా ఉపయోగించుకొని పరీక్షకు సమాయత్తం కావాలని సూచించింది. ఎన్‌టీఏ అభ్యాస యాప్‌ ద్వారా నమూనా పేపర్లు రాసి, ఇంట్లోనే సాధన చేయాలని పేర్కొంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు