కొత్తగా 6,361 కొవిడ్‌ కేసులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తగా 6,361 కొవిడ్‌ కేసులు

మరో 51 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 6,361 (ఇప్పటి వరకూ మొత్తం 4,69,722) కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో 51 మంది (మొత్తం 2,527) మృతి చెందారు. ఈ నెల 4న(మంగళవారం) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 77,435 (మొత్తం 1,32,67,252) నమూనాలను పరీక్షించారు. మరో 3,882 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,225 కొత్త కేసులు నమోదవగా, నల్గొండ జిల్లాలో 453, రంగారెడ్డిలో 423, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 422, కరీంనగర్‌లో 248, సిద్దిపేటలో 244, సూర్యాపేటలో 239, వరంగల్‌ నగర జిల్లాలో 234, సంగారెడ్డిలో 227, మహబూబ్‌నగర్‌లో 224, నాగర్‌కర్నూల్‌లో 190, ఖమ్మంలో 188, జగిత్యాలలో 178, నిజామాబాద్‌లో 164, యాదాద్రి భువనగిరి జిల్లాలో 162 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 150 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి.
మరో 65,551 డోసుల పంపిణీ
రాష్ట్రంలోని మొత్తం 946 కేంద్రాల్లో మంగళవారం మరో 65,551 కొవిడ్‌ టీకా డోసులను వైద్యఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. ఇప్పటి వరకూ 42,24,880 మంది తొలి డోసును, 6,55,455 మంది రెండో డోసును స్వీకరించారు.

ఏపీలో 22,204 మందికి కరోనా

ఈనాడు, అమరావతి: ఏపీలో గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 22,204 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 1,16,367 నమూనాలు పరీక్షించగా.. అందులో 19.08 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని