ఒకే కాన్పులో 9 మంది
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే కాన్పులో 9 మంది

మాలీ దేశానికి చెందిన మహిళ అరుదైన రికార్డు
శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుల వెల్లడి

మాలీ: మహిళకు ఒక కాన్పులో ఎంతమంది జన్మిస్తారు? ఒకరు లేదా ఇద్దరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముగ్గురు పుడతారు. అలాంటిది.. ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చారు. ఆఫ్రికా దేశమైన మాలీకి చెందిన హాలిమా సిస్సే (25) గర్భం దాల్చడంతో మొరాకోలోని ఆసుపత్రిలో మార్చి నెలలో పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో వైద్యులు ఆమె గర్భంలో ఏడుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. సందేహంతో మరోమారు లెక్కించగా ఏడుగురు ఉన్నట్లు వెల్లడైంది. అనంతరం ఆ మహిళకు జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఈ క్రమంలో మంగళవారం హాలిమా సిస్సేకి నొప్పులు రాగా మొరాకోలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. వరుసగా ఏడుగురు శిశువులను తీశారు. అయినప్పటికీ.. గర్భంలోని ఓ ప్రాంతంలో మరో ఇద్దరు శిశువులు అతుక్కుని ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆ శిశువులనూ జాగ్రత్తగా బయటకు తీశారు. తొమ్మిది మంది సంతానంలో అయిదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు మాలీ ఆరోగ్య శాఖ మంత్రి ఫాంటా సిబే ఓ ప్రకటనలో తెలిపారు. సిస్సేతోపాటు మొరాకో వెళ్లిన వైద్యుడు తనకు ఈ విషయం చెప్పారని వెల్లడించారు. తల్లీపిల్లలు స్వదేశానికి రావడానికి కొన్ని వారాలు పట్టొచ్చన్నారు. మరోవైపు, ఒకే కాన్పులో ఇంతమందికి జన్మనివ్వడమే కాకుండా వారందరూ క్షేమంగా ఉండడం ఓ అద్భుతమని వైద్యులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని