కొవిడ్‌ 3.0 అనివార్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ 3.0 అనివార్యం

ఆ దశ ప్రారంభ సమయాన్ని ఊహించలేం
కేంద్ర ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు వెల్లడి

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున మూడో దశ కూడా కచ్చితంగా వస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు విజయరాఘవన్‌ తెలిపారు. అది ప్రారంభమయ్యే సమయాన్ని కచ్చితంగా చెప్పలేమన్నారు. మున్ముందు రాబోయే దశలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బుధవారం దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో సూచించారు. ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు, టీకాలు వైరస్‌పై ఒత్తిడి పెంచుతాయని, వీటి నుంచి తప్పించుకోవడానికి కొత్త రూపాన్ని సంతరించుకొనేందుకు అది ప్రయత్నిస్తుందన్నారు. అందువల్ల కొత్త వైరస్‌ రకాలకు తగినట్లుగా టీకాల్లో మార్పులు తీసుకురావడం తప్పనిసరని పేర్కొన్నారు. టీకా నిరోధకతను పొందే వైరస్‌ రకాలన్నింటినీ గుర్తిస్తూ మ్యాపింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని