గనుల్లో పేలిన జిలెటిన్‌ స్టిక్స్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గనుల్లో పేలిన జిలెటిన్‌ స్టిక్స్‌

10 మంది కూలీల మృతి
100 అడుగుల మేర ఎగిరిపడ్డ మృతదేహాలు
కడప జిల్లాలో దుర్ఘటన

ఈనాడు డిజిటల్‌-కడప: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోరప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని తిరుమలకొండ వద్ద ఉన్న ముగ్గురాయి గనుల్లో జరిగిన భారీ పేలుళ్లలో శనివారం పది మంది కూలీలు మరణించారు. భూమి లోపల గనుల తవ్వకాలు జరిపేందుకు వీలుగా వేంపల్లె నుంచి కారులో డ్రైవరు ప్రసాద్‌ శనివారం ఉదయం భారీ స్థాయిలో జిలెట¨న్‌ స్టిక్స్‌ను తీసుకొచ్చారు. వాట¨ని కూలీల సహాయంతో భద్రతా చర్యలు తీసుకోకుండా దింపుతుండగా ప్రమాదం జరిగింది. కూలీలు సిగరెట్లు కాల్చేందుకు ప్రయత్నించగా నిప్పురవ్వలు పడి పేలుళ్లు జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పేలుళ్ల ధాట¨కి కూలీల మృతదేహాలు సుమారు 100 అడుగుల మేర తునాతునకలుగా పడిపోయాయి. కొన్ని గుర్తించలేని విధంగా ఉన్నాయి.  చెట్లు దెబ్బతినడంతో పాటు ఆకులు పూర్తిగా రాలిపోయాయి. కారు విడిభాగాలు వివిధ చోట్ల పడిపోయాయి.  వేముల మండలానికి చెందిన ఈశ్వరయ్య(45), వెంకటరమణ(25), గంగిరెడ్డి(50), లక్ష్మీరెడ్డి(60), సుబ్బారెడ్డి(45), బాలు గంగులు(35), అబ్దుల్‌(30), వేంపల్లెకు చెందిన వెంకటేష్‌(25), కలసపాడుకు చెందిన బత్తుల ప్రసాద్‌(40), పోరుమామిళ్ల మండలానికి చెందిన కొరివి ప్రసాద్‌(35)లు మృతిచెందారు. తహసీల్దారు రామచంద్రుడు ఫిర్యాదు మేరకు కలసపాడు స్టేషన్‌లో వైకాపా సింగిల్‌విండో అధ్యక్షుడు సి.నాగేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మద్దిలేట¨ తెలిపారు. మామిళ్లపల్లె గ్రామంలోని 1, 133 సర్వే నంబర్లలో 75.84 ఎకరాల విస్తీర్ణంలో ముగ్గురాయి తవ్వకాల కోసం ప్రస్తుత ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య సి.కస్తూరిబాయికి 2001లో లీజుకు ఇచ్చారు. దీనికి 20 ఏళ్ల గడువు ఉండగా, 2013లో సి.నాగేశ్వరరెడ్డికి జీపీఏ(జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అట¥ర్నీ) ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి..
ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరగడానికి గల కారణాలను ఉన్నతాధికారులను అడి…గి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కర్ఫ్యూ సమయంలో మైనింగ్‌కు ఎలా అనుమతించారు: చంద్రబాబు
ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతుండగా మైనింగ్‌కు ప్రభుత్వం ఎలా అనుమతినిచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ముగ్గురాళ్ల గనిలో భారీ పేలుడు జరిగి పలువురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని  పేర్కొన్నారు. ‘విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ బాధితులకు ఇచ్చిన పరిహారమే మామిళ్లపల్లె బాధిత కుటుంబాలకూ ఇవ్వాలి. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి’ అని ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
* మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని