రాష్ట్రంలో 5,186 కేసులు.. 38 మంది మృతి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రంలో 5,186 కేసులు.. 38 మంది మృతి

73.54 శాతం నిండిన ఐసీయూ పడకలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 5,186 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కేసులు 4,92,385కు చేరుకున్నాయి. ప్రస్తుతం క్రియాశీల  కేసులు 68,462 ఉన్నాయి. చికిత్స పొందుతూ మరో 38 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 2,704 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలో చనిపోయిన వారి సంఖ్య 392కి చేరింది. వారంలో 49,025 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గంటకు ఇద్దరు చొప్పున మరణించారు. తాజాగా 7,994 మంది కోలుకున్నారు. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,21,219కి పెరిగింది.

మూడు రోజుల క్రితం రోజువారీ పరీక్షల సంఖ్య పెంచినప్పటికీ.. రెండు రోజులుగా మళ్లీ తగ్గాయి. కిట్లు అందుబాటులో లేక పరీక్షల సంఖ్య పెరగడం లేదు. బుధవారం 79 వేల పరీక్షలు నిర్వహించగా.. శనివారం 69 వేలకు పడిపోయింది. వీటిలోనూ 19 వేల పరీక్షలు ప్రైవేటు కేంద్రాల్లో జరిగాయి. ప్రైవేటులో పరీక్షల కోసం రూ.1,500 వరకు చెల్లించాల్సి వస్తోంది. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 904, రంగారెడ్డి జిల్లాలో 399, మేడ్చల్‌లో 366, వరంగల్‌ అర్బన్‌లో 231, కరీంనగర్‌లో 182, ఖమ్మంలో 176, వికారాబాద్‌లో 175, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌లలో 172 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్‌లకు డిమాండ్‌
కరోనా చికిత్సకు ఆక్సిజన్‌, ఐసీయూ పడకల డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు 20,550 అందుబాటులో ఉండగా.. 14,058 (68.40 శాతం) నిండిపోయాయి. 6,491 ఖాళీగా ఉన్నాయి. ఐసీయూ పడకలు 11,218 ఉండగా.. 8,250 (73.54 శాతం) నిండాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 596, ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,372 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని