ఏపీలో 24గంటల్లో 96 మంది మరణం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో 24గంటల్లో 96 మంది మరణం

కొత్తగా 20,065 కొవిడ్‌ కేసులు

ఈనాడు, అమరావతి: ఏపీలో కొవిడ్‌ విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో మరణాలను గమనిస్తే ప్రతి పావుగంటకు ఓ కొవిడ్‌ బాధితుడు ప్రాణాలు విడుస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య మహమ్మారి కోరల్లో చిక్కి 96 మంది మరణించారు. ఈ స్థాయి మరణాలు ఏపీలో ఇదే తొలిసారి. పశ్చిమ గోదావరిలో అత్యధికంగా 14 మంది, విశాఖపట్నంలో 12, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పదేసి మంది చనిపోయారు. 24గంటల్లో 1,01,517 నమూనాలు పరీక్షించగా 20,065 (19.76శాతం)మందికి కరోనా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్‌ కేసులు 12,65,439కు, మరణాలు 8,615కు చేరాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని