Corona: బంధనంలోకి భారతం
close

ప్రధానాంశాలు

Corona: బంధనంలోకి భారతం

అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు

దిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి.

లాక్‌డౌన్‌లు ఎక్కడెక్కడ?
* దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మెట్రో రైలు సేవలను కూడా రద్దు చేశారు.
* తమిళనాడు, రాజస్థాన్‌, పుదుచ్ఛేరిల్లో సోమవారం నుంచి రెండు వారాల పాటు అమలు చేస్తారు.
* హరియాణాలో ఈనెల 17 వరకు పొడిగించారు. ఇంతకుముందు 9 జిల్లాల్లో వారంతపు కర్ఫ్యూను అమలు చేశారు.
* కేరళలో 9 రోజులు (శనివారం నుంచి), మిజోరమ్‌లో 7 రోజుల (సోమవారం నుంచి) పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.
* బిహార్‌లో ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది.
* ఒడిశాలో 14 రోజుల లాక్‌డౌన్‌ ఈనెల 19 వరకు అమల్లో ఉంటుంది.
* నాగాలాండ్‌లో కఠిన నిబంధనలతో పాక్షికంగా ఈనెల 14 వరకు అమలు చేస్తున్నారు.

వారాంతాల్లో..
*
చండీగఢ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి.
* ఛత్తీస్‌గఢ్‌లోనూ వారాంతపు లాక్‌డౌన్‌ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
* పంజాబ్‌లో ఈనెల 15 వరకు వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూలతో పాటు కఠిన నిబంధనలు విధించారు.

లాక్‌డౌన్‌ తరహా..
*
మహారాష్ట్రలో ఏప్రిల్‌ 5న ప్రారంభించిన నిబంధనలను ఈనెల 15 వరకు పొడిగించారు.  
* ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలతో కూడిన కరోనా కర్ఫ్యూని ఈనెల 17 వరకు పొడిగించారు.
* ఝార్ఖండ్‌లో ఈనెల 13 వరకు పొడిగించారు.
* కర్ణాటకలో ఈనెల 24 వరకు అమలు చేస్తున్నారు. ః సిక్కింలో ఈనెల 16 వరకు ఆంక్షలు విధించారు.
* జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈనెల 10 వరకు నిబంధనలను అమలు చేస్తోంది.

కర్ఫ్యూలు..
* గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు అమలు చేస్తోంది.
* మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
* గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 12 వరకు అమలు చేస్తున్నారు.
* అస్సాంలో కర్ఫ్యూ  రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై సాయంత్రం 6 గంటల నుంచే విధిస్తున్నారు.
* అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది.
* మణిపుర్‌లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ.
* ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ సహా పలు నిబంధనలను తిరిగి విధించింది.
* హిమాచల్‌ప్రదేశ్‌ ఈనెల 7 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ లేదా కరోనా కర్ఫ్యూ పేరిట నిబంధనలు విధించింది.
* పశ్చిమబెంగాల్‌లో గత వారం నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని