TS Govt: పడక ఉంటేనే రండి
close

ప్రధానాంశాలు

TS Govt: పడక ఉంటేనే రండి

ముందుగా ఆసుపత్రిలో రిజర్వు చేసుకోవాలి
ఇతర రాష్ట్రాలవారికి తెలంగాణ నిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే బాధితులు ముందుగా ఇక్కడి ఆసుపత్రుల్లో పడక రిజర్వు చేసుకుని, అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులకు లేఖ రాశారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు ముందుగా పడక గురించి మాట్లాడుకోకుండానే చికిత్స కోసం వస్తున్నారని.. వచ్చాక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ విలువైన చికిత్స సమయాన్ని కోల్పోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇలా వచ్చేవారు స్ట్రెయిన్ల వ్యాప్తికి కారణమవుతున్నారనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల నివారణ, విపత్తుల నిర్వహణ చట్టం కింద విధివిధానాలు జారీ చేసింది. ఇక్కడ చికిత్స కోసం వచ్చేవారు ముందుగా ఆసుపత్రులతో మాట్లాడుకుని పడక రిజర్వు చేసుకోవాలని తెలిపింది. ఆ ఆసుపత్రులు బాధితుల పేరు, వయసు, సహాయకుల పేరు, ఫోన్‌ నంబరు, పడక కేటగిరీ వివరాలను కంట్రోల్‌ రూమ్‌కు పంపిస్తాయి. ఈ వివరాలు పరిశీలించి కంట్రోల్‌ రూమ్‌ రవాణాకు అనుమతి ఇస్తుందని, ఈ సమాచారాన్ని ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని