నేడు, రేపు కరోనా టీకాలు బంద్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడు, రేపు కరోనా టీకాలు బంద్‌

17 నుంచి తిరిగి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను శని, ఆదివారాల్లో నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్యశాఖ తెలిపింది. కొవిషీల్డ్‌ టీకా రెండో డోసును ఇప్పటివరకు 6-8 వారాల మధ్య తీసుకునే అవకాశం ఉండేది. ఆ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం 12-16 వారాలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాల అమలుకు ప్రణాళికల్లో భాగంగా 45 ఏళ్ల వయసు పైబడిన వారికి రెండో డోసును రెండ్రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. రెండో డోసు టీకాల కార్యక్రమాన్ని తిరిగి 17వ తేదీ(సోమవారం) నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు