కొత్తగా 4,305 కరోనా కేసులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తగా 4,305 కరోనా కేసులు

మరో 29 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,20,709కి చేరింది. కరోనా చికిత్స పొందుతూ మరో 29(మొత్తం 2,896) మంది మృతి చెందారు. శుక్రవారం 57,416 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 607 కొవిడ్‌ కేసులు నమోదవగా.. రంగారెడ్డి జిల్లాలో 293, మేడ్చల్‌ మల్కాజిగిరి 291, నల్గొండ 246, కరీంనగర్‌ 229, ఖమ్మం జిల్లాలో 222 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఈ మహమ్మారి నుంచి తాజాగా 6,361(మొత్తం 4,62,981) మంది కోలుకున్నారు.
మిల్లులో 30 మందికి పరీక్షలు.. 28 మందికి పాజిటివ్‌
మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: నల్గొండజిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలోని ఓ బియ్యం మిల్లులో పనిచేస్తున్న 30 మందికి కరోనా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా.. 28 మందికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారిణి సీహెచ్‌ వనిత శుక్రవారం తెలిపారు.
39,555 టీకాల పంపిణీ
ప్రభుత్వం శుక్రవారం మరో 39,555 మందికి కరోనా టీకాలను వేసింది. ఇందులో 1,045 మంది తొలి డోసు, 38,510 మంది రెండో డోసు తీసుకున్నవారు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 43,75,396 మంది తొలి డోసు, 11,03,872 మంది రెండో డోసు టీకాలు తీసుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు