కొత్తగా 4,298 కరోనా కేసులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తగా 4,298 కరోనా కేసులు

మరో 32 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,25,007కు చేరింది. మహమ్మారితో చికిత్స పొందుతూ మరో 32(మొత్తం 2,928)మంది మృతి చెందారు. రాష్ట్రంలో శనివారం 64,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 601 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 328, రంగారెడ్డిలో 267, ఖమ్మంలో 203 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. తాజాగా కరోనా నుంచి 6,026(మొత్తం 4,69,007) మంది కోలుకున్నారు. మరో 53,072 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలో 22,517 కేసులు.. 98 మరణాలు
ఈనాడు, అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 22,517 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ 24 గంటల్లో 98 మంది మరణించారు. మొత్తం క్రియాశీల కేసులు 2,07,467కు చేరాయి. 18,739 మంది కోలుకున్నారు. మొత్తం 89,535 మందికి పరీక్షలు చేయగా 22,517 (25.14పాజిటివిటీ రేటు) మందికి పాజిటివ్‌గా తేలింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క రోజు వ్యవధిలో మూడు వేలకు పైగా (3,383) కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల అనంతపురంలో 12 మంది, నెల్లూరు- 11, తూర్పుగోదావరి- 10, విశాఖపట్టణం, విజయనగర జిల్లాల్లో 9 మంది చొప్పున, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 8మంది చొప్పున, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అయిదుగురు చొప్పున మరణించారు. కడప జిల్లాలో ఇద్దరు చనిపోయారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని