ఒక్కరోజే 1.30 లక్షల పరీక్షలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కరోజే 1.30 లక్షల పరీక్షలు

కొత్తగా 1,798 కరోనా కేసులు
మరో 14 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,798 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 5,98,611కు పెరిగింది. మహమ్మారితో మరో 14 మంది కన్నుమూయడంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 3,440కు చేరింది. తాజాగా 2,524 మంది చికిత్స పొంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,561 క్రియాశీల కేసులున్నాయి. ఈ నెల 10న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 1,30,430 నమూనాలను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 1,63,87,698కి పెరిగింది. 1,226 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 174 కేసులు, ఖమ్మం జిల్లాలో 165, నల్గొండలో 151, రంగారెడ్డిలో 107 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.
మరో 1.74 లక్షల డోసుల పంపిణీ
రాష్ట్రంలో మరో 1,74,302 కొవిడ్‌ టీకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంలోని 656 కేంద్రాల్లో 1,17,523 డోసులు, ప్రైవేట్‌లోని 29 కేంద్రాల్లో 56,779 డోసులు ఇచ్చారు. మొత్తంగా ఇప్పటివరకూ 57,48,744 మంది తొలి డోసు, 14,69,555 మంది రెండో డోసు పొందారు. రాష్ట్రంలో టీకాల వృథా 0.17 శాతంగా నమోదైనట్లు డీహెచ్‌ తెలిపారు.

ఏపీలో 24 గంటల వ్యవధిలో 8,110 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో 67 మంది మృతి చెందారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య  97,863 నమూనాలను పరీక్షించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు