ఏటీఎం లావాదేవీలు మరింత భారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏటీఎం లావాదేవీలు మరింత భారం

ఈ ఏడాది ఆగస్టు నుంచే ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంపు

ముంబయి: వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటికి మించి చేసే నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి లావాదేవీలపై ప్రస్తుతం వినియోగదారుల నుంచి బ్యాంకులు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు-నిర్వహణకు వ్యయాలు పెరగడం, ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెరగడం, సాధారణ ఖర్చులకు గాను  వినియోగదారు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. సొంత బ్యాంక్‌ ఏటీఎంల నుంచి వినియోగదారులు ప్రతి నెలా 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కలిపి) నిర్వహించుకోవడం కొనసాగనుంది. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంకు ఏటీఎంలలో 3 ఉచిత లావాదేవీలు, మిగతా ప్రాంతాల్లో 5 లావాదేవీలను  అనుమతిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.
ఏటీఎం లావాదేవీలపై ప్రస్తుత ఛార్జీలు 2014 ఆగస్టు నుంచి, ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీలు 2012 ఆగస్టు నుంచి అమలవుతున్నాయి.
గత మార్చి 31కు చూస్తే బ్యాంకు కార్యాలయాల ప్రాంగణాల పరిధిలో 1,15,605 ఏటీఎంలు, ఇతర ప్రాంతాల్లో 97,970 ఏటీఎం కేంద్రాలున్నాయి.
90 కోట్ల డెబిట్‌ కార్డులు వాడుకలో ఉన్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని