మరో 13 కేటగిరీల వారికి ప్రత్యేక డ్రైవ్‌లో టీకాలు
close

ప్రధానాంశాలు

మరో 13 కేటగిరీల వారికి ప్రత్యేక డ్రైవ్‌లో టీకాలు

సోమవారం నుంచి ప్రారంభం
జాబితాలో పూజారులు, ఇమాంలు, పాస్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పనిచేస్తున్నవారికి ప్రత్యేక డ్రైవ్‌ కింద కరోనా టీకాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 13 విభాగాల్లో పనిచేస్తున్నవారికి సోమవారం ప్రారంభించి గురువారంతో టీకాల ప్రక్రియ ముగించనుంది. పూజారులు, ఇమాంలు, పాస్టర్లను ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో చోటుకల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జిల్లాల యంత్రాంగాలు కీలకమైన ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి టీకాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం టీకాల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే కరోనా వాహకులుగా గుర్తించిన 24 కేటగిరీల్లో పనిచేస్తున్నవారి కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. తాజాగా మరో 13 కేటగిరీల్లో పనిచేస్తున్న దాదాపు 3 లక్షల మందికి టీకాలు ఇవ్వనున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఎక్సైజ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ సిబ్బంది, పంచాయతీరాజ్‌ ప్రతినిధులు, విద్యుత్తు సిబ్బంది, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, బ్యాంకులు, ఆర్‌ఎంపీలు, ఇంజినీరింగ్‌, ఐకేపీ, పోస్టల్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల సిబ్బంది, డయాలసిస్‌ - తలసేమియా కేంద్రాల సిబ్బందికి టీకాలు వేయనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని