పసిడి కాంతుల్లో పంచనారసింహుని సన్నిధి
close

ప్రధానాంశాలు

పసిడి కాంతుల్లో పంచనారసింహుని సన్నిధి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: స్వర్ణదేవాలయం, వేలూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను గుర్తుకుతెచ్చేలా పసిడి కాంతుల్లో యాదాద్రి పంచనారసింహుల సన్నిధి శనివారం సాదృశ్యమైంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బెంగళూరులోని లైటింగ్‌ టెక్నాలజీ సంస్థ రూపొందించిన విద్యుద్దీపాలతో స్తంభోద్భవుడి ఆలయానికి వెలుగులద్దారు. ఆ కాంతులతో పసిడిమయమైన గోపురాలు, మండప ప్రాకారాలు, ప్రధానాలయ ముఖమండపం, ఆళ్వారుల ప్రతిమలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ‘విశ్వఖ్యాతి పొందే తరహాలో కృష్ణశిలతో ఆలయ పునర్‌ నిర్మాణానికి సంకల్పించిన సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశంతో ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి ఈ లైటింగ్‌ రూపకల్పనకు ఏడాదిన్నరగా శ్రమించారు.’ అని యాడా, ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన విద్యుద్దీప కాంతుల ప్రయోగాత్మక పరిశీలనలో మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్‌ సునీత, సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, యాడా వైస్‌ఛైర్మన్‌ కిషన్‌రావు తదితరులు పాల్గొని తిలకించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని