TS News: 61.55 లక్షల మందికి రైతుబంధు
close

ప్రధానాంశాలు

TS News: 61.55 లక్షల మందికి రైతుబంధు

కొత్తగా 2.22 లక్షల మందికి
బ్యాంకు ఖాతాల వివరాల నమోదుకు రైతుల ప్రదక్షిణలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత వానాకాలంలో రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలున్నట్లు తేలింది. రెవెన్యూ రికార్డుల్లో భూమి ఖాతాల ప్రకారం పార్ట్‌ బీ నుంచి పార్ట్‌ ఏ విభాగంలోకి మారిన రైతులు వీరని రెవెన్యూశాఖ తెలిపింది. గత యాసంగిలో 59.33 లక్షల మందికి ఈ పథకం సొమ్ము అందింది. కొత్తగా 2.22 లక్షల మందిని చేరుస్తున్నందున మొత్తం ఈ సీజన్‌లో సొమ్ము అందుకునేవారి సంఖ్య 61.55 లక్షలుంటుందని ప్రాథమిక అంచనా. ఈ నెల 10 వరకూ భూములను కొన్న రైతులను పథకంలో నమోదు చేయాల్సి ఉంది. ఈ నెల 10 వరకూ మొత్తం 2.22 లక్షల మంది రైతులను పార్ట్‌ బీ నుంచి పార్ట్‌ ఏ ఖాతాల్లోకి మార్చినట్లు రెవెన్యూశాఖ వెల్లడించింది. వీరి పేర్లకు ఎదురుగా బ్యాంకు పొదుపు ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు, దాని ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఏఈఓలే గ్రామస్థాయిలో పరిశీలించి రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాలి. తమ పేర్లను నమోదు చేయాలంటూ అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని