కొత్తగా మరో 1,280 మందికి కరోనా
close

ప్రధానాంశాలు

కొత్తగా మరో 1,280 మందికి కరోనా

15 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా మరో 1,280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 6,03,369కి చేరింది. కరోనా చికిత్స పొందుతూ 15 మంది చనిపోయారు. మరణాల సంఖ్య 3,484గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 91,621 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 165, ఖమ్మంలో 156, నల్గొండలో 80, రంగారెడ్డిలో 76, కరీంనగర్‌లో 74 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కరోనా నుంచి మరో 2,261 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 5,78,748కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 21,137 మంది కరోనా చికిత్సలో ఉన్నారు.

నిర్మల్‌ జిల్లాలో నిల్‌..
నిర్మల్‌, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లాలో ఆదివారం ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. మొదట్లో వందల్లో వచ్చిన కేసులు నాలుగైదు రోజులుగా 10 లోపే ఉన్నాయి. ఆదివారం జిల్లాలోని 24 కేంద్రాల్లో ఏడింటికి బాధితులు ఎవరూ రాక పోవడంతో కరోనా పరీక్షలు చేయలేదు. మిగతా 17 కేంద్రాల్లో 815 నిర్ధారణ పరీక్షలు చేయగా ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదు. దీంతో మొదటిసారి జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదని వైద్య సిబ్బంది తెలిపారు.


ఏపీలో కొత్తగా 6,770 మందికి పాజిటివ్‌..
58 మంది మృతి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 1,02,876 నమూనాలను పరీక్షించగా 6,770 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మరో 58 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 18,09,844కు, మరణాలు 11,940కు చేరాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని