పవన విద్యుత్తు ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌!
close

ప్రధానాంశాలు

పవన విద్యుత్తు ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌!

సైమెన్స్‌ సంస్థ అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: హైడ్రోజన్‌ను ఇప్పటివరకూ రాకెట్‌ ఇంధనంలా, ఆయిల్‌ రిఫైనరీల్లో, అమ్మోనియా ఎరువులు, స్టీలు, రసాయనాల తయారీకి వినియోగిస్తున్నారు. సహజవాయువు, గ్యాస్‌ను ఉపయోగించి హైడ్రోజన్‌ను తయారు చేస్తున్నారు. ఇది పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ కాలుష్యానికి కారణమవుతోంది. దీంతో ప్రభుత్వం గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోంది. విద్యుత్తు, రవాణా తదితర రంగాల్లో దీని వినియోగాన్ని పెంచాలని అడుగులు వేస్తోంది. అనేక సంస్థలు దీనిపై అధ్యయన పత్రాలు రూపొందిస్తున్నాయి. తాజాగా గ్రీన్‌హౌస్‌ వాయువులను విడుదల చేయకుండా, 2030 నాటికి పవన విద్యుత్తు ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం సాధ్యం అవుతుందని ఒక సంస్థ అంచనా వేసింది. గ్రీన్‌హైడ్రోజన్‌ అనేది పునరుత్పాదక ఇంధనంతో రూపొందించేది కావటంతో లాభదాయకం అవుతుందని, టర్బైన్‌ తయారీదారు సైమెన్స్‌ గమేషా అనే సంస్థ వెల్లడించింది. నీటిని వినియోగించి ఆన్‌షోర్‌ విండ్‌ టర్బైన్స్‌, పవర్‌ ఎలక్ట్రోలైట్ల ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయటం 2030 నాటికి సాధ్యపడుతుందని, ఆఫ్‌షోర్‌కయితే మరో ఐదేళ్లు వేచి ఉండాల్సి వస్తుందంది. అలాగే  ప్రభుత్వం, పారిశ్రామిక రంగం పునరుత్పాద ఇంధనంపై దృష్టిపెడితే  గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి అధికమై, దాని ధర కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని