నేడు యాదాద్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ
close

ప్రధానాంశాలు

నేడు యాదాద్రికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

స్వాగతం పలకనున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ యాదాద్రి పర్యటన ఖరారైంది. సతీ సమేతంగా ఆయన మంగళవారం ఉదయం స్తంభోద్భవుడిని దర్శించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి బయల్దేరి యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి చేరుకుంటారు. దర్శనం అనంతరం పునర్‌నిర్మితమవుతున్న ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ పరిశీలన అనంతరం వీవీఐపీ అతిథిగృహంలోనే అల్పాహారం చేస్తారు. ప్రధానాలయానికి ఉత్తర దిశలో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ విల్లా కాంప్లెక్స్‌, ఆలయనగరి (టెంపుల్‌ సిటీ)ని పరిశీలిస్తారు.  అనంతరం 10 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. ముందుగా అనుకున్నట్టు సీజేఐ వెంట గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లిలు రావడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సీజేఐ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథి మర్యాదలను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలు చూసుకుంటారని సమాచారం.

జస్టిస్‌ ఎన్‌వీ రమణను కలిసిన ప్రముఖులు
ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను సోమవారం హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆయనను రాజ్‌భవన్‌ అతిథిగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, అదనపు ఏజీ జె.రామచందర్‌రావు, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ జి.కిషన్‌రావు, పలువురు న్యాయవాదులు జస్టిస్‌ ఎన్‌వీ రమణను కలిసి అభినందనలు తెలిపారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని