కొత్తగా 1,511 కొవిడ్‌ కేసులు
close

ప్రధానాంశాలు

కొత్తగా 1,511 కొవిడ్‌ కేసులు

మరో 12 మంది మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 1,10,681 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 1,511 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 12 మంది కన్నుమూయగా.. ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 3,496కి చేరుకుంది. తాజాగా 2,175 మంది కొవిడ్‌కు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా.. మొత్తంగా 5,80,923 మంది కోలుకున్నారు. ఈ నెల 14న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 173 కొత్త కేసులు నమోదవగా, ఖమ్మంలో 139, నల్గొండలో 113 చొప్పున నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 1,55,781 కొవిడ్‌ టీకాల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకూ 64,69,106 మంది తొలిడోసును, 15,10,530 మంది రెండోడోసును స్వీకరించారు. రాష్ట్రంలో టీకాల వృథా 0.16 శాతంగా నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు.

ఏపీలో 4,549కేసులు.. 59 మరణాలు
ఈనాడు, అమరావతి: ఏపీలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 87,756 నమూనాలు పరీక్షించగా.. 4,549 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. 59 మంది మృతిచెందారు.

అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా

అపోలో గ్రూపు ఆసుపత్రుల జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(జేఎండీ) సంగీతారెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ నెల 10వ తేదీన జ్వరంగా ఉండటంతో పరీక్ష చేయించుకోగా, పాజిటివ్‌ వచ్చినట్లు తేలిందన్నారు. ‘ఈ విషయం తెలియగానే కొంత షాకింగ్‌గా అనిపించింది. ఇప్పటికే టీకా రెండు డోసులు వేయించుకోవడంతోపాటు అన్ని జాగ్రత్తలు పాటించినా ఎలా సోకిందో’’ అని ఆమె విస్మయం వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో చేరానని, వైద్యులు యాంటీబాడీస్‌ కాక్‌టైల్‌ థెరపీ చేశారని ట్విటర్‌లో పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని