విస్తారంగా వర్షాలు
close

ప్రధానాంశాలు

విస్తారంగా వర్షాలు

రాష్ట్రంలో నేడూ రేపూ మాదిరి వానలు

ఈనాడు, హైదరాబాద్‌, వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తీరం దాటి ఝార్ఖండ్‌పైకి చేరింది. ఇది తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఝార్ఖండ్‌ నుంచి పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాలవైపు పయనిస్తుందని అంచనా. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి. వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.8, కోనరావుపేట, చందుర్తిలో 12, పెద్దూరులో 11.5, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, వేములవాడలో 10, భీంగల్‌(నిజామాబాద్‌)లో 11, ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌లో 10, బజార్‌హత్నూర్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువగా ఉంటోంది. గాలిలో తేమ సాధారణంకన్నా 27 నుంచి 29 శాతం అధికంగా ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని