నేతన్నకు చేయూత పునఃప్రారంభం
close

ప్రధానాంశాలు

నేతన్నకు చేయూత పునఃప్రారంభం

35 వేల కుటుంబాలకు లబ్ధి
మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల లబ్ధికి ‘నేతన్నకు చేయూత’ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీని ద్వారా 35 వేల కుటుంబాలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. చేనేత కార్మికులు తమ వేతనాల నుంచి ప్రతి నెలా 8 శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం దానికి రెట్టింపుగా 16 శాతం, మరమగ్గాల కార్మికులు 8 శాతం పొదుపు చేస్తే దానికి మరో 8శాతం జమ చేస్తుందని, గడువు ముగిశాక వడ్డీతో కలిపి కార్మికులకు అందజేస్తుందని వెల్లడించారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో చేనేత, జౌళి శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల కాలపరిమితి ఉన్న ‘నేతన్నకు చేయూత’ పథకాన్ని గత ఏడాది రెండేళ్లకు కుదించాం. కార్మికులు చేసిన పొదుపునకు రెట్టింపు జమతో మొత్తం 25 వేల మందికి రూ.109 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాం. గత పథకం మూడేళ్ల కాలపరిమితి ప్రస్తుతం ముగియడంతో మళ్లీ కొనసాగించాలని నేతన్నలు కోరారు. ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకున్నాం. గతంలో కేవలం సొసైటీల పరిధిలో ఉన్న చేనేతలకు ఈ పథకం ఉండేది. సొసైటీల్లో లేని చేనేత, మరమగ్గాల కార్మికులతోపాటు అద్దకం కార్మికులు, డిజైనర్లు, వైండర్లు ఇతర పనివారు కూడా ఈ పథకంలో చేరేందుకు ప్రస్తుతం వెసులుబాటు కల్పించాం’’ అని కేటీఆర్‌ వివరించారు. సమీక్షలో ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, కమిషనర్‌ శైలజారామయ్యర్‌ పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని