కొత్తగా 1,556 కొవిడ్‌ కేసులు
close

ప్రధానాంశాలు

కొత్తగా 1,556 కొవిడ్‌ కేసులు

మరో 14 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 1,20,043 నమూనాలను పరీక్షించగా 1,556 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం పరీక్షల సంఖ్య 1,69,54,634కు, బాధితుల సంఖ్య 6,06,436కు చేరుకుంది. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరో 14 మంది మృతిచెందగా, ఇప్పటి వరకూ 5,510 మంది కరోనాతో కన్నుమూశారు. తాజాగా 2,070 మంది చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా.. మొత్తంగా 5,82,993 మంది కోలుకున్నారు. 15న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,933 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,013 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాలి. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 182 కేసులు నమోదవగా.. ఖమ్మం జిల్లాలో 131, నల్గొండలో 135, భద్రాద్రి కొత్తగూడెంలో 114 చొప్పున నిర్ధారణ అయ్యాయి.
మరో 1.86 లక్షల డోసుల పంపిణీ
రాష్ట్రంలో మరో 1,86,527 కొవిడ్‌ టీకా డోసుల పంపిణీ పూర్తయింది. ఇందులో ప్రభుత్వ వైద్యంలో 790 కేంద్రాల్లో 1,39,215 డోసులుండగా.. ప్రైవేటు వైద్యంలో 44 కేంద్రాల్లో 47,312 డోసులున్నాయి.

ఏపీలో 5,741 మందికి కొవిడ్‌..
53 మంది మృతి

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య మొత్తం 96,153 నమూనాలు పరీక్షించగా వారిలో 5.91 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది. 5,741 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మరో 53 మంది కరోనాతో మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 18,20,134కు, మరణాలు 12,052కు చేరాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని