జస్టిస్‌ రమణను కలిసిన దత్తాత్రేయ
close

ప్రధానాంశాలు

జస్టిస్‌ రమణను కలిసిన దత్తాత్రేయ

భట్టి, డీఎస్‌, లక్ష్మణ్‌ కూడా...
రాజ్‌భవన్‌లో మొక్క నాటిన సీజేఐ
హరితసవాలు నిర్వాహకుడు ఎంపీ సంతోష్‌కు ప్రశంస

ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణతో పలువురు ప్రముఖులు మంగళవారం భేటీ అయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయనను కలిసి సత్కరించారు. అత్యున్నత పదవిని చేపట్టినందుకు అభినందించారు. జస్టిస్‌ రమణను కలిసినవారిలో తెలంగాణ శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌రావు, కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఉన్నారు.
జస్టిస్‌ రమణ తాను బస చేసిన రాజ్‌భవన్‌ అతిథిగృహం వద్ద మొక్కను నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆయనకు వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా హరిత సవాలు(గ్రీన్‌ ఛాలెంజ్‌) కార్యక్రమాన్ని చేపట్టినందుకు సంతోష్‌ను జస్టిస్‌ రమణ అభినందించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సీజేఐను కలిసి సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న ఏకీకృత సర్వీసు కేసును పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర వర్కింగు జర్నలిస్టుల సమాఖ్య ప్రతినిధులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పలువురు న్యాయవాదులు జస్టిస్‌ రమణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని