Rythu Bandhu: రైతుబంధు ఖాతాల్లోకి రూ.517 కోట్లు
close

ప్రధానాంశాలు

Rythu Bandhu: రైతుబంధు ఖాతాల్లోకి రూ.517 కోట్లు

ఎకరా లోపు విస్తీర్ణమున్న 17 లక్షల మందికి తొలిరోజు జమ 
మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద తొలిరోజు మంగళవారం బ్యాంకులకు రూ.516.95 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఎకరాలోపు విస్తీర్ణం కలిగిన 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు వేశామన్నారు. జిల్లాల వారీగా నల్గొండలో అత్యధికంగా 1,11,970 రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు జమ అయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఎకరాలోపు భూమిని కలిగిన వారు అత్యల్పంగా 9628 మంది మాత్రమే ఉండటంతో వారి ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు వేసినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 16,95,601 మంది వద్ద ఉన్నది 10,33,915 ఎకరాలని వివరించారు. చాలా మంది రైతులకు అర ఎకరం, ఇంకా అంతకన్నా తక్కువగా భూమి ఉంది. రెండోరోజైన బుధవారం రెండెకరాల వరకు భూమి కలిగిన 15.07 లక్షల మంది ఖాతాల్లో రూ.1152.46 కోట్లు జమ చేయనున్నారు. వరి సాగులో నాట్లు వేయకుండా గింజలు నేరుగా విత్తుకుంటేనే లాభదాయకమని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. నేరుగా విత్తుకునే పద్ధతులపై టీశాట్‌ ఛానల్‌లో జరిగిన చర్చలో ఆయనతో పాటు రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రఘురాంరెడ్డి, శాస్త్రవేత్త హేమంత్‌ కుమార్‌లు పాల్గొని రైతులకు సూచనలిచ్చారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని