Eatala: ఈటల ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం
close

ప్రధానాంశాలు

Eatala: ఈటల ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం

ఈనాడు, దిల్లీ, శంషాబాద్‌, అబిడ్స్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి ఈటల బృందాన్ని దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకురావాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారి ప్రయాణం గంటన్నర ఆలస్యమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు దిల్లీ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. రన్‌ వేపై కొద్దిదూరం ప్రయాణించి గాలిలోకి ఎగిరే సమయంలో (టేకాఫ్‌) సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలెట్‌ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరించారు. ఉదయం 9.30 గంటలకు తిరిగి విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఉదయం 11.45 గంటలకు ఈటల బృందం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. భాజపా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. శంషాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరారు.  
ఈటల రాజేందర్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను సొసైటీ మేనేజింగ్‌ కమిటీ మంగళవారం ఆమోదించింది. మరోవైపు కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తొలి ప్రాధాన్యంగా మంత్రి కేటీఆర్‌ పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని