దూరంగా వెళ్లిపోయిన అల్పపీడనం
close

ప్రధానాంశాలు

దూరంగా వెళ్లిపోయిన అల్పపీడనం

పెద్దపల్లిలో 13 సెం.మీ.ల వర్షం

ఈనాడు, హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: ఝార్ఖండ్‌పై సోమవారం వరకూ ఉన్న అల్పపీడనం మంగళవారం తెలంగాణకు మరింత దూరంగా వెళ్లింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దపల్లిలో 13, ధర్మారం(పెద్దపల్లి జిల్లా)లో 12, వాంకిడి(కుమురం భీం)లో 11, శ్రీరాంపూర్‌లో 11, కెరమెరిలో 9, ఆదిలాబాద్‌లో 9, సిర్పూర్‌లో 8, కాప్రా(హైదరాబాద్‌)లో 7.3, కుషాయిగూడలో 5.8, ఫీర్జాదిగూడలో 5.8, సఫిల్‌గూడ్‌లో 5.3, తిరుమలగిరిలో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో గాలిలో తేమ పెరిగి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తగ్గాయి. కుమురం భీం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, ఒర్రెలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుశ్నపల్లి పెద్దవాగులో తాత్కాలింగా వేసిన రోడ్డు తెగిపోయింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని