కొత్తగా 1,417 కొవిడ్‌ కేసులు
close

ప్రధానాంశాలు

కొత్తగా 1,417 కొవిడ్‌ కేసులు

మరో 12 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 1,24,430 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 1,417 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,10,834కు చేరగా.. పరీక్షల సంఖ్య 1,73,14,780కి చేరింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 12 మంది మృతిచెందగా, ఇప్పటి వరకూ 3,546 మంది కన్నుమూశారు. తాజాగా 1,897 మంది చికిత్స పొంది కోలుకోగా, మొత్తంగా 5,88,259 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 18న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,029 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మరో 994 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 149 కేసులు నమోదవగా.. రంగారెడ్డిలో 104, ఖమ్మంలో 93, నల్గొండలో 88, కరీంనగర్‌లో 87, సూర్యాపేటలో 85, భద్రాద్రి కొత్తగూడెంలో 82, పెద్దపల్లిలో 65, వరంగల్‌ నగర జిల్లాలో 62, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 61, మహబూబాబాద్‌లో 60 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 1,82,523 కొవిడ్‌ టీకాల డోసులు పంపిణీ చేశారు. 


ఏపీలో 6,341 మందికి వైరస్‌
57 మంది కన్నుమూత

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 6,341 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి మరో 57 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 1,07,764 నమూనాలు పరీక్షించారు.
కర్ఫ్యూ సడలింపు
ఏపీలో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పెంచారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మినహాయింపు ఉండగా.. ఈ నెల 20వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఉంటుందని సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దుకాణాలు సాయంత్రం 5కల్లా మూసేయాలని, 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ రేటు అధికంగా ఉన్నందున అక్కడ మాత్రం ప్రస్తుతమున్నట్లే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2వరకే సడలింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఎప్పటిలాగే సాధారణ సమయాల్లో పనిచేస్తాయని చెప్పారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని