కొత్తగా 1,175 కొవిడ్‌ కేసులు
close

ప్రధానాంశాలు

కొత్తగా 1,175 కొవిడ్‌ కేసులు

మరో 10 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,175 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,15,574కు పెరిగింది. మరో 10 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ మొత్తం 3,586 మంది కన్నుమూశారు. తాజాగా 1,771 మంది కోలుకోగా.. మొత్తం 5,95,348 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 22న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,640 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,24,907 నమూనాలను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 1,77,70,083కు పెరిగింది. 820 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. మరోపక్క రాష్ట్రంలో మరో 1,52,169 టీకా డోసులు పంపిణీ చేశారు.  
* ఏపీలో 24 గంటల వ్యవధిలో 4,169 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణైంది. రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మృతి చెందారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని