రేపు లేదా ఎల్లుండి కేంద్ర కేబినెట్‌ విస్తరణ?

ప్రధానాంశాలు

రేపు లేదా ఎల్లుండి కేంద్ర కేబినెట్‌ విస్తరణ?

 అమిత్‌ షాతో మోదీ మంతనాలు

దిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ ఆదివారం సుదీర్ఘంగా సమావేశమవటం వీటికి బలం చేకూరుస్తోంది. విస్తరణ జాబితాకు తుది మెరుగులివ్వటానికే వీరు సమావేశమయ్యారని అనుకుంటున్నారు. ఆదివారం మోదీ నివాసంలో వీరి భేటీ జరిగింది. వివరాలు అధికారికంగా వెల్లడించకున్నా... ఈ నెల 7 లేదా 8న విస్తరణ ఉండొచ్చని దిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. అస్సాం మాజీ సీఎం శర్వానంద సోనోవాల్‌, జ్యోతిరాదిత్య, సుశీల్‌ మోదీలకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం బలంగా ఉంది. కమలనాథుల మిత్ర పక్షాలైన జేడీ (యు), అప్నాదళ్‌లాంటి వాటికీ కొన్ని బెర్తులు లభించొచ్చు. శివసేన, అకాలీదళ్‌ లాంటివి విడిపోయాక... రిపబ్లికన్‌ పార్టీ నేత రాందాస్‌ అఠావలె ఒక్కరే ప్రస్తుతం మిత్రపక్షాల నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. రాం విలాస్‌ పాసవాన్‌ స్థానంలో... లోక్‌జన్‌శక్తి చీలిక వర్గం నేత పశుపతి పరాస్‌ పేరుబలంగా వినిపిస్తోంది. వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న యూపీ నుంచి ఎక్కువ మందికి చోటు దొరికే అవకాశం ఉంది. బెంగాల్‌కూ ప్రాతినిధ్యం పెరుగుతుందని సమాచారం.

2019లో మోదీ రెండో దఫా పదవి చేపట్టాక చేస్తున్న తొలి విస్తరణ ఇదే అవుతుంది. ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 81 మంది ఉండొచ్చు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని