సెప్టెంబరు 12న ‘నీట్‌’

ప్రధానాంశాలు

సెప్టెంబరు 12న ‘నీట్‌’

ఈనాడు, దిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య వైద్య కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ) మళ్లీ వాయిదా పడింది. ఆగస్టు 1న జరగాల్సిన ఈ పరీక్షను సెప్టెంబరు 12న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహిస్తామని ట్విటర్‌లో తెలిపారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5నుంచి జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ కారణంగా భౌతిక దూరం పాటించాల్సి ఉండటంతో... పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచామన్నారు. గత ఏడాది ఏర్పాటుచేసిన 3,862 పరీక్ష కేంద్రాలకు తోడు మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆయా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఫేస్‌ మాస్కులు అందజేస్తారని చెప్పారు. ప్రవేశ, నిష్క్రమణల కోసం దశల వారీ సమయాలు అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నీట్‌ను ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తెలుగు, కన్నడ, తమిళం సహా 11 భాషల్లో నిర్వహిస్తారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని