కొత్తగా 691 కొవిడ్‌ కేసులు
close

ప్రధానాంశాలు

కొత్తగా 691 కొవిడ్‌ కేసులు

మరో 5 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 691 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,38,721కి పెరిగింది. మహమ్మారితో మరో 5 మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ 3,771 మంది కన్నుమూశారు. తాజాగా 565 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 6,25,042 మంది కోలుకున్నారు. ఈ నెల 21న సాయంత్రం 5.30 గంటలకు నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,908 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,14,260 నమూనాలను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 2,08,68,791కి పెరిగింది. 594 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 కేసులు నమోదు కాగా.. ఖమ్మం జిల్లాలో 56, కరీంనగర్‌లో 55, సూర్యాపేటలో 47, పెద్దపల్లిలో 42, వరంగల్‌ నగర జిల్లాలో 41 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 40 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని