గొర్రెల కోసం గ్రామాల్లో షెడ్లు
close

ప్రధానాంశాలు

గొర్రెల కోసం గ్రామాల్లో షెడ్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

కురుమ సంఘం కృతజ్ఞతలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రతి సామాజికవర్గం బాగుపడాలనే ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. యాదవులు, గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టామని, పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. గొర్రెల కోసం గ్రామాల్లో షెడ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నామన్నారు. గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్ల కేటాయింపుతో పాటు యూనిట్‌ ధరను పెంచడంపై రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, సంఘం నాయకులు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు గొంగడి వేసి సత్కరించారు. యూనిట్‌ ధర పెంచి మరో 3.81 లక్షలమందికి గొర్రెల్ని పంపిణీ చేయాలని నిర్ణయించడంపై యాదవ, కురుమ సంఘాల నేతలు తెలంగాణ భవన్‌ వద్ద సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇదే అంశంపై యాదవ సంఘం నాయకుడు దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్‌, గొల్ల కుర్మ హక్కుల పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్‌లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సాట్స్‌ ఛైర్మన్‌కు సీఎం అభినందన

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌-సాట్స్‌) ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని