కొవిడ్‌ కాస్త తగ్గుముఖం

ప్రధానాంశాలు

కొవిడ్‌ కాస్త తగ్గుముఖం

దిల్లీ: దేశంలో రెండు రోజులుగా 40 వేలకు పైగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల సంఖ్య శుక్రవారం కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 35,342 కొత్త కేసులు బయటపడగా.. 483 మంది కొవిడ్‌తో మృతి చెందారు. అయితే ఒక రోజులో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా గురువారం 16,68,561 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ మరణాల్లో సగం మేర కేరళ (122), మహారాష్ట్ర (120)ల్లోనే నమోదయ్యాయి.

 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని