కొత్తగా 39,361 మందికి కరోనా

ప్రధానాంశాలు

కొత్తగా 39,361 మందికి కరోనా

416 మంది మృతి

దిల్లీ: దేశంలో కొత్తగా 39,361 మంది కొవిడ్‌-19 బారిన పడగా, 416 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు, మొత్తం మరణాల సంఖ్య 4,20,967కు చేరింది. సుమారు 35 రోజుల తర్వాత రోజువారీ పాజిటివిటీ రేటు మూడు శాతం దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 4,11,189 క్రియాశీల కేసులు ఉండగా, మొత్తం కేసుల్లో వీటి వాటా 1.31 శాతంగా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి శాతం 97.35 శాతానికి పెరిగింది.

* కొత్తగా నమోదైన 416 మరణాల్లో ఒక్క మహారాష్ట్ర నుంచే 123 ఉండగా, ఒడిశా నుంచి 67, కేరళ నుంచి 66 నమోదయ్యాయి. 

* దేశంలో ఇప్పటివరకు 43.51 కోట్ల కొవిడ్‌-19 టీకా డోసులను వేసినట్లు అధికారులు ప్రకటించారు.

* ఈ నెల 25వ తేదీ వరకు 45,74,44,011 నమూనాలను పరీక్షించామని, ఒక్క ఆదివారమే 11,54,444 కరోనా పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి సోమవారం తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని