దళిత బంధు యూనిట్లు ఖరారు

ప్రధానాంశాలు

దళిత బంధు యూనిట్లు ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న దళిత బంధు పథకం కింద పలు యూనిట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. లబ్ధిదారులకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాల గురించి వివరిస్తూ.. ఆర్థికాభివృద్ధి పథకాల కింద యూనిట్ల వివరాలను వెల్లడించింది. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో ఇప్పటికే అమలవుతున్న వివిధ పథకాలను క్రోడీకరీస్తూ, మరిన్ని యూనిట్లను ప్రతిపాదించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనువైన వ్యాపార, ఉపాధి రంగాలను గుర్తించి వాటి వివరాలను తెలియజేసింది.

ఆర్ధికాభివృద్ధి పథకాల జాబితా..

గ్రామీణ ప్రాంతాలు : మినీ డెయిరీ, పందిరి కూరగాయల సాగు, వరినాటు యంత్రాలు, పవర్‌ టిల్లర్‌, వేపనూనె పిండి తయారీ, ఆటో ట్రాలీ పథకాలు

గ్రామీణ, సబర్బన్‌ ప్రాంతాలు : వ్యవసాయ సాగు యంత్రాల అమ్మకాలు, మట్టి ఇటుకల తయారీ, ఆటో ట్రాలీ, ట్రాక్టర్‌ ట్రాలీ, కోళ్ల పెంపకం

గ్రామీణ, సబర్బన్‌, పట్టణ ప్రాంతాలు : సెవన్‌ సీటర్‌ ఆటో, ప్యాసింజర్‌ ఆటో రిక్షా, త్రీ వీలర్‌ ఆటో ట్రాలీ, విత్తనాలు/ఎరువుల, క్రిమిసంహారక మందుల దుకాణం (ప్రభుత్వ అనుమతితో), టెంట్‌హౌస్‌, డెకొరేషన్‌ లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌, మడిగల నిర్మాణం, వ్యాపారం, ఆయిల్‌ మిల్‌, పసుపు, కారం, బియ్యం పిండి గిర్నీ

సబర్బన్‌, పట్టణ ప్రాంతాలు : ప్రయాణికులు/సరకుల రవాణాకు నాలుగు చక్రాల వాహనం, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ సేల్స్‌, డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌, మెడికల్‌ షాప్‌, ఎలక్ట్రికల్‌ షాప్‌, బ్యాటరీ సేల్స్‌ అండ్‌ సర్వీసెస్‌, హార్డ్‌వేర్‌ శానిటరీ షాప్‌, ఆటో, సిమెంట్‌ ఇటుకలు/ రింగుల తయారీ, ప్రీకాస్టింగ్‌ స్ట్రక్చర్‌, ఆటో ట్రాలీ, సెంట్రింగ్‌/ఆర్‌.సి.సి. రూఫ్‌ మేకింగ్‌ (స్టీల్‌, ఉడెన్‌), కాంక్రీట్‌ రెడీ మిక్స్‌ తయారీ యంత్రం, టైల్స్‌ వ్యాపారం, హోటల్‌, క్యాటరింగ్‌ (దాబా), ఐరన్‌ గేట్స్‌, గ్రిల్స్‌ తయారీ, మెడికల్‌, జనరల్‌ స్టోర్స్‌ (ప్రభుత్వ అనుమతితో), మినీ సూపర్‌ బజార్‌, డీటీపీ, మీసేవ, సీఎస్సీ ఆన్‌లైన్‌ సర్వీస్‌, ఫొటో స్టుడియో, బిల్డింగ్‌ మెటీరియల్‌ స్టోర్స్‌/హార్డ్‌ వేర్‌, మార్బుల్‌, పాలిషింగ్‌ / గ్రానైట్‌ కటింగ్‌ / పీఓపీ, ఫుడ్‌ రెస్టారెంట్‌, సిమెంట్‌/స్టీల్‌ దుకాణం (సబ్‌ డీలర్‌షిప్‌), పశువులు, కోళ్ల దాణా తయారీ కేంద్రం, చెప్పులు/లెదర్‌ గూడ్స్‌ షాపు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ డ్రోన్‌ కెమెరా (అన్ని ఫంక్షన్ల కోసం), ప్రభుత్వ అనుమతితో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లకు కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం ఆటో ట్రాలీలను అందించే పథకాలు.

పట్టణ ప్రాంతాలు : మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ (4 వీలర్‌), క్లాత్‌ ఎంపోరియం - టెక్స్‌టైల్‌, రెడీమేడ్‌ గార్మెంట్స్‌ షోరూం, పేపర్‌ ప్లేట్స్‌/గ్లాసెస్‌, బ్యాగులు, తయారీ యూనిట్‌ (ఆటో ట్రాలీతో కలిపి), టాక్సీ (క్యాబ్‌), ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌, లేడీస్‌ ఎంపోరియం, కిచెన్‌ ఫర్నిచర్‌ షాప్‌ (సేల్స్‌, సర్వీస్‌), ఫ్లెక్సీ, వినైల్‌ డిజిటల్‌ ప్రింటింగ్‌ (ఆటో ట్రాలీతో కలిపి), డిజిటల్‌ ఫొటో స్టూడియో - ల్యాబ్‌, ఆటో మొబైల్‌ షాప్‌- సర్వీసింగ్‌ యూనిట్‌, డిస్పోజబుల్‌ పేపర్‌ ప్లేట్స్‌, గ్లాసెస్‌, పేపర్‌ న్యాప్కిన్స్‌ దుకాణం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని