స్మాష్‌ అదిరింది.. పంచ్‌ పడింది

ప్రధానాంశాలు

స్మాష్‌ అదిరింది.. పంచ్‌ పడింది

బాక్సింగ్‌లో లవ్లీనాకు పతకం ఖాయం

బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో సింధు

తొలి రోజు రజతంతో ఒలింపిక్స్‌లో బోణీచేసిన భారత్‌కు ఆ తర్వాత ఆరు రోజులూ నైరాశ్యమే. ఏడో రోజు కాంతి రేఖలా వచ్చింది అస్సాం బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌. టోక్యోలో పెద్దగా అంచనాల్లేకుండా అడుగు పెట్టిన లవ్లీనా.. అద్భుత ప్రదర్శనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ 69 కేజీల విభాగంలో సెమీస్‌ గడప తొక్కింది. భారత్‌కు ఓ పతకాన్ని ఖాయం చేసింది. కనీసం కాంస్యం.. కుదిరితే రజతం.. అన్నీ కలిసొస్తే స్వర్ణం.. మరి లవ్లీనా ‘పంచ్‌’ ఏ పతకాన్ని తెచ్చిపెడుతుందో?

లవ్లీనా ఘనత సాధించిన రోజే.. తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు పతకం దిశగా మరో కీలక విజయం సాధించడం అభిమానులకు అమితానందాన్నిచ్చే విషయం. రియోలో రజతం గెలిచిన ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌.. టోక్యోలో మహిళల సింగిల్స్‌ సెమీస్‌ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వేయాల్సింది ఇంకో రెండడుగులే. శుక్రవారం ఈ ఇద్దరమ్మాయిల ప్రదర్శన మురిపిస్తే.. పతకాశలు రేపిన ఆర్చర్‌ దీపికా కుమారి, షూటర్‌ మను బాకర్‌ నిరాశపరిచారు. హాకీలో పురుషులు, మహిళల జట్లు రెండూ విజయాలు నమోదు చేయడం సానుకూలాంశం. అంచనాల్లేని అథ్లెటిక్స్‌లో ఫలితాలన్నీ ప్రతికూలమే.

సింధు గర్జన

 

కొట్టేయ్‌.. కంచుకు మించి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని