రాష్ట్రంలోనూ డెల్టా ప్లస్‌ వేరియంట్‌

ప్రధానాంశాలు

రాష్ట్రంలోనూ డెల్టా ప్లస్‌ వేరియంట్‌

రెండు కేసులు వచ్చినట్లు కేంద్రం ప్రకటన

ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో ఉనికి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కొత్త రూపాంతరం(వేరియంట్‌) డెల్టా ప్లస్‌ రాష్ట్రంలోనూ వెలుగులోకి వచ్చింది. ఈ డెల్టా ప్లస్‌ కేసులు ఈ నెల 23 నాటికి తెలంగాణలో రెండు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో డెల్టా ప్లస్‌ ఉనికి ఉందని స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 70 డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా మారింది. రెండో దశలో దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ బీభత్సం సృష్టించింది. ఇప్పుడు ఆ డెల్టా రకం మరికొన్ని మార్పులతో డెల్టా ప్లస్‌గా మారింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 ప్లస్‌ కేసులు ఉన్నాయి.

614 కరోనా కేసులు.. నలుగురి మృతి

రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 614 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,44,330గా నమోదైంది. కరోనా చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోవడంతో మృతుల సంఖ్య 3,800కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 1,11,251 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 73, కరీంనగర్‌లో 61, వరంగల్‌ అర్బన్‌లో 59, ఖమ్మం 47, నల్గొండలో 45 చొప్పున కేసులు వచ్చాయి. కరోనా నుంచి మరో 657మంది కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 6,31,389గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9,141 మంది కరోనా చికిత్సలో ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని