44 వేలకు పైగా కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

44 వేలకు పైగా కొవిడ్‌ కేసులు

ఈ నెల 8 తర్వాత ఇదే అత్యధికం

24 గంటల్లో 555 మంది మృతి

దిల్లీ: దేశంలో కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు గణాంకాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈమేరకు రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారం పెరిగింది. గత 24 గంటల్లో 44,230 కొత్త కేసులు బయటపడగా.. 555 మంది కొవిడ్‌తో చనిపోయారు. ఈ నెల 8 తర్వాత మళ్లీ 44 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. జులై తొలి 8 రోజుల్లో 4 సార్లు మాత్రమే కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య ఈ మార్కు దాటింది. క్రియాశీలక కేసుల సంఖ్యతో పాటు, వారపు పాజిటివిటీ రేటు కూడా పెరగడం ఆందోళనకరం. దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3,15,72,344కి చేరింది. ఇంతవరకు మహమ్మారి బారిన పడి 4,23,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా గురువారం 18,16,277 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.44%గా ఉంది. వారపు పాజిటివిటీ రేటు 2.43% నమోదైంది. క్రితం రోజు ఇది 2.38%గా ఉంది. రోజువారీ మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర (190), కేరళ (128), ఒడిశా (65)ల్లో సంభవించాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య 40కి దిగువనే నమోదైంది. 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్‌ మరణమూ నమోదు కాకపోవడం కొంత ఊరట.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని