గత ఏడాది కంటే పెరిగిన ఆదాయం

ప్రధానాంశాలు

గత ఏడాది కంటే పెరిగిన ఆదాయం

రెవెన్యూ రాబడి రూ.24,529 కోట్లు

రుణాలు రూ.12,891 కోట్లు

కాగ్‌కు ఆర్థికశాఖ గణాంకాలు

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర బడ్జెట్‌ అంచనాల్లో మొదటి త్రైమాసిక రెవెన్యూ రాబడులు 14 శాతంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి జూన్‌ నెలాఖరు వరకూ రుణాలు కాకుండా రూ.24,529 కోట్లు వచ్చినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడి 3.7 శాతం పెరిగినట్లు విశ్లేషించింది. జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల రాబడి, అమ్మకం పన్ను ఎక్సైజ్‌ డ్యూటీ, ఇతర పన్నుల రాబడి గతం కంటే అధికమని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జూన్‌ నెల వరకూ రాబడులు, వ్యయానికి సంబంధించిన గణాంకాల వివరాలను కాగ్‌కు ఆర్థికశాఖ అందించింది. రాష్ట్రానికి మొత్తం రాబడుల లక్ష్యం రూ.2,21,686 కోట్లు కాగా మొదటి మూడు నెలల్లో రూ.37,533 కోట్లు వచ్చినట్లు వివరించింది. రంగాల వారీగా ఆర్థిక సంవత్సరంలో రూ.1,98,430 కోట్ల వ్యయ లక్ష్యంలో మొదటి మూడు నెలల్లో రూ.33,038 కోట్లు వ్యయం అయినట్లు, రూ.12,891 కోట్లను రుణాలుగా సేకరించినట్లు పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని