నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి

ప్రధానాంశాలు

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి

గవర్నర్‌కు మంత్రిమండలి సిఫారసు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనమండలి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి హుజూరాబాద్‌ నియోజకవర్గ తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని మంత్రిమండలి ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్‌ తమిళిసైకి సిఫార్సు చేసింది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలానికి చెందిన కౌశిక్‌రెడ్డి (37) క్రికెట్‌ క్రీడాకారుడు. 2018లో కాంగ్రెస్‌లో చేరి, హుజూరాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈటల రాజేందర్‌ తెరాసకు రాజీనామా చేసిన తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస టికెట్‌ ఆశించినప్పటికీ.. ఆ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని నిర్ణయించినందున కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే నామినేటెడ్‌ కోటాలో ఎంపిక చేసినట్లు తెలిసింది.

హుజూరాబాద్‌ అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్‌కు తెరాస అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, మాజీమంత్రి ఎల్‌.రమణ, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని