ఐదో రోజూ క్రియాశీలక కేసుల పెరుగుదల

ప్రధానాంశాలు

ఐదో రోజూ క్రియాశీలక కేసుల పెరుగుదల

24 గంటల్లో 41,831 మందికి కొవిడ్‌

దిల్లీ: దేశంలో వరుసగా ఐదో రోజూ (ఆదివారం) కొవిడ్‌ క్రియాశీలక కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో 41,831 కొత్త కేసులు బయటపడగా.. 541 మంది కరోనా బాధితులు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,16,55,824కి పెరగ్గా.. ఇంతవరకు 4,24,351 మందిని మహమ్మారి బలి తీసుకుంది.

* ఒక్క రోజులో కోలుకున్న వారి సంఖ్య 39,258 కాగా.. ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 4,10,952 (1.30%)కి పెరిగింది. రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 97.36%కి చేరింది.

* దేశవ్యాప్తంగా శనివారం 17,89,472 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34% నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 2.42%కి చేరింది.

* గత 24 గంటల్లో మహారాష్ట్రలో 225 మంది కొవిడ్‌తో మృతి చెందారు. కేరళలో 80, ఒడిశాలో 68, కర్ణాటకలో 37 మరణాలు సంభవించాయి. మిగతా అన్నిచోట్ల రోజువారీ మరణాల సంఖ్య 30 లోపే నమోదైంది.

* 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రియాశీలక కేసులు పెరిగాయి. వీటిలో అత్యధికంగా కేరళలో 3,679 మేర పెరుగుదల నమోదైంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని