కృష్ణానది జలాలపై ఇద్దరు సీఎంలు చర్చించాలి

ప్రధానాంశాలు

కృష్ణానది జలాలపై ఇద్దరు సీఎంలు చర్చించాలి

పర్యావరణ వేత్త మేధా పాట్కర్‌

పాలమూరు, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కృష్ణా నది జలాల పంపకాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి, ఆ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రముఖ పర్యావరణ వేత్త మేధా పాట్కర్‌ సూచించారు. ఆదివారం ‘పాలమూరు అధ్యయన వేదిక - తెలంగాణ విద్యా వంతుల వేదిక’ ఆధ్వర్యంలో ‘కృష్ణా జలాల వివాదం - గెజిట్‌ పర్యవసానాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా నది జల వివాదాన్ని అవకాశంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాలను తన అదుపులో పెట్టుకోవడానికి చూస్తోందని ఆరోపించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా గెజిట్‌ విడుదల చేసిందన్నారు. ఈ గెజిట్‌ను ఇద్దరు ముఖ్యమంత్రులు ఆమోదిస్తే.. తమ రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేరని అన్నారు. అందుకే దీన్ని ఆమోదించవద్దని కోరారు. ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. కృష్ణా నది జల వివాదం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే వచ్చిందన్నారు. ఆచార్య కోదండరామ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కృష్ణా నది జలాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్రంలోని ఖాళీ భూములపై శ్రద్ధ చూపుతున్నారని మండిపడ్డారు.సకల జనుల సమ్మెకు వచ్చే నెల 12వ తేదీతో దశాబ్దం పూర్తి అవుతుందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరో ఉద్యమానికి ప్రజలంతా సిద్ధం కావాలన్నారు.  మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ.. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. పాలమూరు అధ్యయన వేదిక మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవాచారి, తెలంగాణ విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు అంబటి నాగన్న, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని