క్రియాశీలక కేసుల్లో కొనసాగుతున్న పెరుగుదల

ప్రధానాంశాలు

క్రియాశీలక కేసుల్లో కొనసాగుతున్న పెరుగుదల

24 గంటల్లో 40,134 మందికి పాజిటివ్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లో 40,134 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ముందురోజుతో (41,831) పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గినా.. వరుసగా ఆరో రోజూ క్రియాశీలక కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులో కొవిడ్‌ దెబ్బకు 422 మంది మృత్యువాతపడగా, క్రియాశీలక కేసులు 2,766 పెరిగాయి. మహారాష్ట్రలో 157, ఒడిశాలో 64, కేరళలో 56 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మహమ్మారి బారినపడ్డ వారి మొత్తం సంఖ్య 3,16,95,958కు పెరిగింది. వారిలో 3,08,57,467 మంది కోలుకున్నారు. 4,24,773 మంది కన్నుమూశారు. ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య 4,13,718కి పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 1.31 శాతం. రికవరీ రేటు 97.35%గా, మరణాల రేటు 1.34%గా ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని