591 కొవిడ్‌ కేసులు.. ఇద్దరు మృతి

ప్రధానాంశాలు

591 కొవిడ్‌ కేసులు.. ఇద్దరు మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 591 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య 6,45,997కు పెరిగింది. మహమ్మారి బారినపడి మరో 2 మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 3,807 మంది మృతి చెందారు. కరోనాకు చికిత్స పొంది తాజాగా 643 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 2న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు.


రాష్ట్రంలో 2,578 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ చికిత్స అనంతరం బాధితులను కలవరపెడుతున్న మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు గత నెల 28 నాటికి తెలంగాణలో 2,578 నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 9,654 మంది బాధితులు దీని బారినపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని