ఎంసెట్‌ ప్రారంభం నేడు

ప్రధానాంశాలు

ఎంసెట్‌ ప్రారంభం నేడు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ బుధవారం నుంచి మొదలుకానుంది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు రెండు విడతల చొప్పున వరుసగా మూడు రోజులపాటు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో విడతకు 25-30 వేల మందిని కేటాయించి ఆన్‌లైన్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,64,962 మంది ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేశారు. ఏపీలో 23, తెలంగాణలో 82 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. తాము పూర్తి చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని తీసుకొని పరీక్ష కేంద్రంలో ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విద్యార్థులను కోరారు. ‘విద్యార్థులు మాస్కు ధరించాలని, చిన్న శానిటైజర్‌ బాటిల్‌ తెచ్చుకోవచ్చని కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని